చెరువు శిఖం కబ్జా..దర్జాగా అక్రమ రోడ్డు నిర్మాణం.!
చెరువుల పరిరక్షణకు చట్టాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ వాటి అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రజా అవసరాలంటూ చెరువుల రూపురేఖలను మార్చేస్తున్నారు.
దిశ, మరిపెడ : చెరువుల పరిరక్షణకు చట్టాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ వాటి అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రజా అవసరాలంటూ చెరువుల రూపురేఖలను మార్చేస్తున్నారు. ఇలాంటిదొకటే మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో చోటుచేసుకుంది. మండలం లోని జయ్యారం గ్రామం లోని శివారు సర్వేనెంబర్ 773 లో రామసముద్రం చెరువు సుమారుగా 197 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రజా, రైతు అవసరాలంటూ రోడ్డు నిర్మాణం కోసం రామసముద్రం ఎఫ్ టి ఎల్ పరిధిలో నుండి మంగోలిగూడెం గ్రామం శివారు వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లకు సుమారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో కంకర పోసి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఏకంగా చెరువులోని మట్టిని తవ్వి సైడ్ ట్రాక్ కు అ మట్టి ని ఉపయోగించడం గమనార్హం. మరో విడ్డూరం ఏంటంటే కనీసం శిలాఫలకాన్ని సైతం ఏర్పాటు చేయలేదని, మాకు ఉపయోగం లేని రోడ్డు అంటూ మంగోలి గూడెం రైతులు ఆరోపిస్తున్నారు.