చొప్పదండి ఎమ్మెల్యే భార్య మృతిపై పోలీసుల అధికారిక ప్రకటన

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె మృతిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది.

Update: 2024-06-21 11:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమె మృతిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏంటి అనేదానిపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మేడ్చల్ ఏసీపీ రాములు నాయక్ రూపాదేవి మృతిపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆమె మూడు సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ కారణంగా గురువారం రాత్రి రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్‌కు ముందు రూపాదేవి భర్త సత్యంకు వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో ఎమ్మెల్యే చొప్పదండిలో ఉన్నారు. తను కడుపునొప్పితో బాధపడుతున్నానని భర్తకు వివరించింది. ఆయన వెంటనే వస్తున్నాని బయలుదేరారు. అదే సమయంలో రూపాదేవి బెడ్ రూంలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది’’ అని ఏసీపీ రాములు నాయక్ వివరించారు.

మూడేళ్లుగా రూపాదేవి కడుపు నొప్పితో బాధపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా తగ్గలేదని, గత కొద్ది రోజులుగా హోమియో మందులు కూడా వాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపారు. కాగా, రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో ఆమె తల్లి, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఉరివేసుకున్న వెంటనే ఆమెను సమీపంలోని రెనోవ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు.


Similar News