శాలిబండలో దారుణం... రూ.700 తిరిగి ఇవ్వలేదని కత్తి తో దాడి

చేతి బదులుగా తీసుకున్న రూ.700లు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-07-06 15:16 GMT

దిశ, చార్మినార్ : చేతి బదులుగా తీసుకున్న రూ.700లు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాలాపత్తర్ కు చెందిన తాహీర్ (22) వద్ద అతని స్నేహితుడైన షేక్ అలీం(24) రూ.700లు అప్పుగా తీసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం

     బాయ్స్ టౌన్ పాఠశాల ప్రాంతంలో ఇద్దరు తారసపడ్డారు. డబ్బుల విషయంలో మాట మాట పెరిగి గొడవ జరిగింది. దీంతో తాహీర్ అక్టివా బైక్ ను లాక్కోవడంతో పాటు కత్తితో అలీం కడుపులో పొడిచాడు. దీంతో అలీంకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును శాలిబండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News