పురుగుల మందు తాగిన మహిళ… చికిత్స పొందుతూ మృతి

భార్యాభర్తల మధ్య జరిగిన కుటుంబ గొడవలకు మనస్తాపం చెంది పూజరి దివ్య (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మల్లూరులో చోటు చేసుకుంది

Update: 2024-12-17 09:19 GMT

దిశ, మంగపేట : భార్యాభర్తల మధ్య జరిగిన కుటుంబ గొడవలకు మనస్తాపం చెంది పూజరి దివ్య (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మల్లూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లూరుకు చెందిన దివ్య ఇటీవల జరిగిన బంధువుల పెళ్ళిలో భర్త కిషోర్ తో జరిగిన చిన్న గొడవకు మనస్తాపం చెంది ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజులుగా వరంగల్ ఎంజీఎం లో వైద్యం పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News