Cyber Crime : సైబర్ నేరగాళ్ల వలలో హీరోయిన్
సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) వలలో చిక్కుకొని ఓ తెలుగు హీరోయిన్ డబ్బులు పోగొట్టుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) వలలో చిక్కుకొని ఓ తెలుగు హీరోయిన్ డబ్బులు పోగొట్టుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుందన్‌బాగ్‌లో నివసించే సినీనటి మహిమ(Actress Mahima)కు ఈ నెల 6న రంజన్‌షాహీ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. సినీ నిర్మాతనంటూ పరిచయం చేసుకున్నాడు. కొంత సమయం తర్వాత అతడి సూచనల మేరకు అనిత అనే మరో మహిళ మహిమకు ఫోన్ చేసి తాను సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(CINTAA) నుంచి హెచ్‌ఆర్ డైరెక్టర్‌ను మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నారు. సింటాలో జీవితకాలం పనిచేసే కార్డును రూ.50,500కు అందిస్తున్నామని నమ్మబలికి, నటి నుంచి మూడు దఫాలుగా డబ్బు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మళ్ళీ డబ్బులు అడగడంతో మహిమకు అనుమానం వచ్చింది. సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు. రూ.20,200 సైబర్ నేరస్థుల ఖాతాలోకి వెళ్లకుండా పోలీసులు నిలిపివేశారు. మహిమ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆమె హీరో మంచు విష్ణు(Manchu Vishnu) మోసగాళ్లు(Mosagallu) సినిమాలో సెకెండ్ హీరోయిన్‌గా కనిపించారు.