గుర్తు తెలియని వ్యక్తి మృతి..
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వనస్థలిపురం
దిశ, చైతన్యపురి : గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి (80) వనస్థలిపురం లోని స్వామి నారాయణ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లుగా కాలనీవాసులు గమనించి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 8712662300, 8712662637, 8712662277 నెంబర్లకు తెలియజేయాలని ఆయన కోరారు.