గుర్తు తెలియని మృతదేహం లభ్యం..

గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యక్షమయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..

Update: 2024-10-15 15:35 GMT

దిశ,కార్వాన్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యక్షమయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..మంగళవారం లంగర్ హౌజ్ లోని సంఘం మూసీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (55) మృతదేహం ఉందని  సమచారం అందిందని తెలిపారు. వెంటనే పోలిసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పింక్ కలర్ చొక్కా, బ్లూ కలర్ ప్యాంట్ ధరించినట్లు పోలీసులు తెలిపారు.


Similar News