అనారోగ్య సమస్యలు భరించలేక వ్యక్తి ఆత్మహత్య
అనారోగ్య సమస్యలు భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, సైదాపూర్ : అనారోగ్య సమస్యలు భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి గ్రామంలో చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...వెన్నేపల్లి గ్రామానికి చెందిన వేముల మధునయ్య(68) అనే వ్యక్తి బుధవారం సాయంత్రం ఇంటి వెనకాల ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మూడు సంవత్సరాల క్రితం మధునయ్య భార్య అనారోగ్యంతో మృతిచెందగా మానసికంగా కృంగిపోవడంతో పాటు పక్షవాతం వచ్చింది. దాంతో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాపూర్ ఎస్సై సీహెచ్. తిరుపతి తెలిపారు.