గుండెపోటుతో నందగిరి మృతి..
టీఆర్ఎస్ కార్యకర్త నందగిరి మహేందర్ రెడ్డి (40) గుండెపోటులో గురువారం మృతిచెందారు.
దిశ, హుజూరాబాద్ : పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నందగిరి మహేందర్ రెడ్డి (40) గుండెపోటులో గురువారం మృతిచెందారు. బాత్ రూమ్ లో గుండెపోటుకు గురైన మహేందర్ ను ఆసుపత్రికి తీసుకెల్లగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం పట్ల ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ బండ శ్రీనివాస్, నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లాలోని పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి సంతాపం ప్రకటించారు.
హుజూరాబాద్ ప్రాంతవాసులంతా లడ్డు అని ముద్దు పేరుతొ పిలుచుకునే మహేందర్ గురువారం గుండె పోటుతో మృతి చెందడం అందరిని కలిసి వేసింది. ఎబీవీపీ, బీజేపీ నాయకునిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహేందర్ చురుకైన పాత్ర పోషించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. మహేందర్ మరణం తీరని లోటని కౌశిక్ రెడ్డి, పెద్దిరెడ్డి, శ్రీనివాస్ తో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అన్నారు.