పాలమూరు-రంగారెడ్డి పనుల్లో విషాదం.. విధులు నిర్వహిస్తుండగా టిప్పర్ ఢీకొని డీపీఎం దుర్మరణం..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో విధులు నిర్వహిస్తున్నడీపీఎం ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొని దుర్మరణం చెందాడు.

Update: 2023-05-08 17:29 GMT

దిశ, కొల్లాపూర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో విధులు నిర్వహిస్తున్నడీపీఎం ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొని దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సున్నపుతాండ వద్ద టిప్పర్ కింద పడి ఎస్కే ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీకి చెందిన డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ పనిచేస్తున్న ఖమ్మం జిల్లా వాసి అయిన కృష్ణారెడ్డి (40) దుర్మరణం చెందాడు.

ప్యాకేజ్ వన్ లో భాగంగా కెనాల్ లు నిర్మిస్తున్న క్రమంలో విధులను నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి ప్రమాదవశాత్తు కంపెనీకి చెందిన టిప్పర్ క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో యాజమాన్యం కృష్ణ రెడ్డి మృతదేహాన్ని కొల్లాపూర్ ఆసుపత్రికి కాకుండా గుట్టుగా నాగర్ కర్నూల్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాంట్రాక్టు పనులు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రికి సమీప బంధువు అయిన పుట్టా సుధాకర్ యాదవ్ చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News