వీధి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలు..
వీధి కుక్క చేసిన దాడిలో ఒకేసారి ముగ్గురికి గాయాలైన సంఘటన కొల్లాపూర్ మండల పరిధిలో జరిగింది.
దిశ, కొల్లాపూర్: వీధి కుక్క చేసిన దాడిలో ఒకేసారి ముగ్గురికి గాయాలైన సంఘటన కొల్లాపూర్ మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో సోమవారం ఒకేసారి మురకొండ బిచ్చన్న, అంకిత, లక్కీలపై ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసింది.
దీంతో కుక్కకాటు బాధితులను కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడం జరిగింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించేందుకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.