మూడు నెలల గర్భిణీ ఆత్మహత్య..! హత్య లేక ఆత్మహత్య..?

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వరిముక్కల గ్రామంలో 3 నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది మృతురాలి అక్క రంగమ్మ మాట్లాడుతూ

Update: 2023-05-06 16:15 GMT

దిశ, దేవనకొండ : కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వరిముక్కల గ్రామంలో 3 నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది మృతురాలి అక్క రంగమ్మ మాట్లాడుతూ మా చెల్లి చావుకు కారకులు భర్త జగన్నాథ్, నరసన్న, కృష్ణ, హనుమంతు, రాజమ్మ, సంజన, బలరాముడు, అందరి వేధింపులతో మా చెల్లి చావుకు కారకులయ్యారని శుక్రవారం రాత్రి మా చెల్లి ఉరి వేసుకుందన్న విషయాన్ని భర్త జగన్నాథ్ మాకు సమాచారాన్ని తెలియపరచ లేదు. వీరిద్దరూ గతంలో ఒకరికొకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. సంవత్సరం తర్వాత పెద్దలు కలిసి ఒప్పుకున్నారు.

పెళ్లయిన రెండు సంవత్సరాలైన కూడా మా చెల్లికి పిల్లలు కాలేదని వేధింపులకు గురి చేస్తూ.. భర్త అత్త తమ బంధువులు కలహాలు సృష్టించి మానసికంగా అనేక విధాలుగా బాధపెట్టే వారు. ఆస్తి తగాదాలు సృష్టించి మా చెల్లి కున్న ఆస్తులు తన పేరిట రాయించి ఇవ్వాలని తరచూ డబ్బులు ఆస్తులకోసం వేధించేవాడు. జీవితంలో పిల్లలు కారు నేనెందుకు నీతో ఉండాలి నేను వేరే వివాహం చేసుకుంటాను అని తరచూ సరోజను మానసికంగా వేధించే వాడు. కానీ మా చెల్లి మూడు నెలల గర్భంతో ఉంది. అయినా నువ్వు నాకు వద్దు నాకు ఇష్టం లేదని, నేను వేరే వాళ్ళతో ఉంటానని కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు పడుతున్నారని ఇంటి పక్క వారు చెప్పారు. రోజులానే జరుగుతుందని అందరూ అనుకున్నారు కానీ.. అలా కాకుండా రాత్రికి రాత్రి అనుకోకుండా హత్యకు పాల్పడ్డారని బాధితురాలు బంధువులు ఆరోపిస్తున్నారు.

మా చెల్లి చనిపోయిన విషయం ఉదయం ఏడున్నర గంటల వరకు మాకు చెప్పలేదు. అయినా మేము ఉదయం ఫోన్ చేస్తే బ్రతికే ఉంది అని తెలిపారు. అయినా కూడా మా బంధువులకు విషయం తెలియకుండా మా పిల్లలు వెళ్లి మాకు రాత్రి ఒంటిగంట సమయంలో చనిపోయిందని తెలిపారు. అయినా కూడా ఉదయం ఏడున్నర గంటలకు ఫోన్ చేయగా భర్త జగన్నాథ్ మాకు బతికే ఉందని చెప్పాడు. తర్వాత పూర్తి విషయం తెలియగా తిరిగి ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్‌గా వస్తుంది.

అప్పటి నుంచి ఇప్పటిదాకా హాస్పిటల్‌లో లేకుండా నా చెల్లి భర్త జగన్నాథ్ పరారీలో ఉన్నాడని మృతురాలి అక్క తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించిన ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠినంగా శిక్షించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజకీయ నాయకులు కూడా రంగ ప్రవేశం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసినట్టు మృతురాలి బంధువులు పేర్కొన్నారు. జరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు బాధితులకు న్యాయం చేసి 7 మందికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News