అనుమానాస్పదంగా యువకుడు మృతి
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుగ్గ దేవస్థానం సమీపంలో శుక్రవారం పి.శ్రీకాంత్ (30) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
దిశ, తాండూర్ : తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుగ్గ దేవస్థానం సమీపంలో శుక్రవారం పి.శ్రీకాంత్ (30) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంపూర్ కు చెందిన శ్రీకాంత్ మిషన్ భగీరథ వర్క్ చేస్తూ మంచిర్యాలలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలిసి కల్లు తాగడానికి కన్నాల వచ్చాడు. బుగ్గ దేవస్థానం దగ్గరలో ఫారెస్ట్ ట్రెంచ్ లో పడి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.