బాంబు బెదిరింపు కేసులో నిందితుని అరెస్ట్
ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో బాంబు పెట్టానంటూ 100 నెంబర్‌కు ఫోన్‌చేసిన వ్యక్తిని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారంలో నష్టపోయిన నిందితుడు ఇలా బెదిరింపు ఫోన్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులను కోటి రూపాయలు డిమాండ్చేసినట్టుగా తెలిపారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో బాంబు పెట్టానంటూ 100 నెంబర్‌కు ఫోన్‌చేసిన వ్యక్తిని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారంలో నష్టపోయిన నిందితుడు ఇలా బెదిరింపు ఫోన్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులను కోటి రూపాయలు డిమాండ్చేసినట్టుగా తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరులోని జిన్నా టవర్స్ప్రాంత నివాసి అయిన జైని రాధాకృష్ణ గతంలో బియ్యం వ్యాపారం చేశాడు. అయితే, వ్యాపారంలో భారీ నష్టాలు రావటంతో ప్రస్తుతం వంట వానిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు తలెత్తటం, వాటి కారణంగా భార్య విడాకులు ఇవ్వటంతో మద్యంతోపాటు అన్ని రకాలు దుర్వ్యసనాలకు బానిసయ్యాడు.
తేలికగా డబ్బు సంపాదించాలని పథకం వేసి ఈనెల 11న హైదరాబాద్వచ్చాడు. హయత్నగర్ప్రాంతంలోని ఓ నిర్జన ప్రదేశం నుంచి 100 నెంబర్‌కు ఫోన్‌చేసి ఏసీ గార్డ్స్‌లోని ఆదాయపు పన్ను శాఖ భవనంతోపాటు బషీర్‌బాగ్‌లోని ఆయకర్భవన్, గాంధీనగర్, కవాడీగూడ, సికింద్రాబాద్ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు చెప్పాడు. ఆ తరువాత ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి ఫోన్‌చేసి తనకు కోటి రూపాయలు ఇస్తే ఎక్కడెక్కడ బాంబులు పెట్టానో చెబుతానన్నాడు. కాగా, ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది నుంచి ఫిర్యాదు అందుకున్న నాంపల్లి పోలీసులు సోమవారం నిందితున్ని అరెస్టు చేశారు