పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం… బీటెక్ విద్యార్థి మృతి

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీ పై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది

Update: 2024-12-20 12:44 GMT

దిశ, ఖైరతాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీ పై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. లోకేష్ అనే 20 సంవత్సరాల బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టి డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.


Similar News