గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
మండలంలోని మాన్కపూర్ గ్రామంలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. మహేందర్ తెలిపారు.
దిశ,గుడిహత్నూర్ : మండలంలోని మాన్కపూర్ గ్రామంలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మాన్కపూర్ గ్రామంలో శుక్రవారం విశ్వసనీయ సమాచారం ప్రకారం కుమ్ర హనుమంతు అనే వ్యక్తి ఇంట్లో సోదా నిర్వహించగా 800 గ్రాముల గంజాయి పట్టుకున్నామన్నారు. తనకున్న వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 20 వేల రూపాయల వరకు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా వ్యక్తులు గంజాయిని సాగు చేసినా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.