అనారోగ్యం భరించలేక వివాహిత ఆత్మహత్య
అనారోగ్య సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది.
దిశ, శంకరపట్నం : అనారోగ్య సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన జంగిలి లాస్య(28) గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 14 నెలల చంటి పాపను నిద్రపుచ్చి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
లాస్యకు కొంతకాలం నుండి ఆరోగ్యం బాగా ఉండడం లేదని, ఆ కారణంతోనే ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు బాకారపు ఆంజనేయులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు.