అతివేగంతో అదుపు తప్పిన లారీ.. ఏం జరిగిందో తెలుసా..

ఓ లారి డ్రైవర్ నిర్లక్ష్యానికి కొన్ని వాహనాలు ధ్వంసమయి లక్ష రూపాయల మేర ఆస్తినష్టం జరిగింది.

Update: 2022-10-13 10:54 GMT

దిశ, మాచారెడ్డి : ఓ లారి డ్రైవర్ నిర్లక్ష్యానికి కొన్ని వాహనాలు ధ్వంసమయి లక్ష రూపాయల మేర ఆస్తినష్టం జరిగింది. కామారెడ్డి - సిరిసిల్ల రహదారిపై లారీ డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడంతో లారి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఆవాసాల ముందుకు దూసుకుపోయి పలు వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో లక్షరూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదం మాచారెడ్డి మండలం లక్ష్మి రావుల పల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన శేఖర్ కు సంబంధించిన బైకు, ఆటో, ఎర్రోళ్ల నర్సింహులుకు చెందిన మోపెడ్ లు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సై సంతోష్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

Tags:    

Similar News