288కి చేరిన బాలాసోర్ మృతుల సంఖ్య.. ఇంకా పెరిగే ఛాన్స్!
శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది.
దిశ, వెబ్ డెస్క్: శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 288 మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక 56 మంది తీవ్రంగా గాయపడగా 747 మందికి స్వల్ప గాయాలైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు ఇంకా ఎంత మంది చనిపోయారనే విషయం తెలియనుందని అధికారులు చెబుతున్నారు.
కాగా ప్రమాద స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని మోడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా అందించాలని ప్రధాని రైల్వే మంత్రి, ఇతర అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి: