వ్యక్తి మృతదేహం లభ్యం.. కల్లు తాగి మృతి చెందాడా... ఎవరైనా హత్య చేశారా...!
నారాయణపేట పోలీసులు ఓ మగ మృతదేహాన్ని జలాల్పూర్

దిశ, నారాయణపేట క్రైమ్: నారాయణపేట పోలీసులు ఓ మగ మృతదేహాన్ని జలాల్పూర్ సమీపంలో బుధవారం గుర్తించారు. వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారా? లేక కల్లు తాగే అలవాటు కు బానిస అయి జలాల్పూర్ లో ఉన్న కల్లు దుకాణంలో కల్లు తాగి అస్వస్థతకు గురై మృతి చెందాడ అని అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రం పరమేష్ పల్లి గ్రామానికి చెందిన మొగులప్ప(60) గా పోలీసులు గుర్తించారు. అయితే వ్యక్తి రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా రోధించారు. ఇదిలా ఉండగా చనిపోయిన మొగలప్ప శరీరంపై రక్త గాయాలు ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.