విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి..

మిషన్ ద్వారా వరి పంటలో కోత కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ఓ యువ కౌలు రైతు మృతి చెందాడు.

Update: 2023-05-24 16:11 GMT

దిశ, కంది : మిషన్ ద్వారా వరి పంటలో కోత కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ఓ యువ కౌలు రైతు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. ఇంద్రకరణ్ ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం కలివేముల గ్రామానికి చెందిన బక్కి శ్రీనివాస్ (35) కొంత భూమిని కౌలు కోసం తీసుకుని వరి పంట వేశాడని తెలిపారు.

మే 23న వరి పంటను హార్వెస్టర్ మిషన్ ద్వారా కోత కోస్తున్న సమయంలో రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పొలం పై నుంచి వెళ్తున్న 33 11 కెవి విద్యుత్ వైర్లను సరి చేసే క్రమంలో వైర్లు చేతికి తగిలి విద్యుత్ షాక్ కి గురయ్యాడని తెలిపారు. గమనించిన స్థానికులు బాదితున్ని వెంటనే సంగారెడ్డి లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారన్నారు. మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య మాధవి, పిల్లలు త్రినేత్ర, త్రినేయులు ఉన్నారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

Tags:    

Similar News