West Godavari: పార్శిల్‌లో డెడ్ బాడీ... ఒక్కసారిగా భయాందోళనలు

పశ్చిమగోదావరి జిల్లా యండగండిలో మృతదేహం కలకలం రేగింది. ...

Update: 2024-12-20 05:25 GMT

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా యండగండిలో మృతదేహం కలకలం రేగింది. పార్శిల్‌లో డెడ్ బాడీ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తన ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని యండగండికి చెందిన మహిళ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేశారు. అయితే సేవా సమితి తొలి విడతలో ఇంటి టైల్స్ అందజేసింది. మరోసారి కూడా మహిళ సాయం కోరారు. దీంతో రెండు విడతలో విద్యుత్ సామగ్రి పంపుతున్నట్లు సదరు మహిళకు క్షత్రియ సేవా సమితి నుంచి సమాచారం అందింది. ఈ మేకు యండగండికి పార్మిల్ పంపారు. కానీ పార్మిల్‌లో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ ఉంది. మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీకి వెంటనే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నయూం అస్మీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. క్షత్రియ సేవా సమితికి సమాచారం అందజేశారు. ‘పార్మిల్ ఇచ్చిన వ్యక్తి ఎవరు. మృతదేహం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది. ఎవరు పంపారు’ అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News