Supreme Court: నందిగం సురేశ్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్ నిరాకరణ

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది...

Update: 2024-12-20 09:33 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌(Ycp Former Mp Nandigam Suresh)కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని తుళ్లూరు మండలం వెలగపూడిలో మరియమ్మ హత్య కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్(Interim Bail) కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించి ధర్మాసనం.. నందిగం సురేశ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.అంతేకాదు పలు కేసుల్లోనూ ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఆయనను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో మరియమ్మ కేసులో హైకోర్టు(High Court) తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు.

Tags:    

Similar News