Accident: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private travel bus) బోల్తా పడిన ఘటన నల్గొండ జిల్లా(Nalgonda District)లో జరిగింది. ప్రకాశం జిల్లా కందుకూరు(Kandukuru) నుంచి హైదరాబాద్(Hyderabad) వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా నందిపాడు బైపాస్ (Nandipadu Bypass) వద్ద రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొట్టింది. అనంతరం బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై డ్రైవర్, ప్రయాణికుల నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.