Rajasthan: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
రాజస్థాన్‌లో(Rajasthan) ఘోర అగ్నిప్రమాదం జరిగి.. ఆరుగురు సజీవదహనమయ్యారు. జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్‌జీ ట్యాంకర్ లారీని ట్రక్క్ ఢీకొంది.
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లో(Rajasthan) ఘోర అగ్నిప్రమాదం జరిగి.. ఆరుగురు సజీవదహనమయ్యారు. జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్‌జీ ట్యాంకర్ లారీని ట్రక్క్ ఢీకొంది. దీంతో, జైపూర్- అజ్మీర్(Jaipur-Ajmer National Highway) మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. దాదాపు 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ టెండర్లు చేరుకున్నాయి. ఘటనా స్థలంలో 20 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాధితులను పరామర్శించిన సీఎం
ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్(Sawai Man Singh Hospital) ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma).. సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిని సందర్శించి గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి అవసరమైన వైద్య సదుపాయాలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. మరోవైపు, ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జైపూర్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ తెలిపారు. మంటలు పూర్తిగా ఆర్పివేసినట్లు వెల్లడించారు.