INLD Chief Death: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌటాలా కన్నుమూత

హర్యానా మాజీ ముఖ్యమంత్రి(former Chief Minister of Haryana), భారతీయ జాతీయ లోక్ దళ్ చీఫ్ (INLD) ఓం ప్రకాష్ చౌటాలా(Om Prakash Chautala) కన్నుమూశారు.

Update: 2024-12-20 08:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా మాజీ ముఖ్యమంత్రి(former Chief Minister of Haryana), భారతీయ జాతీయ లోక్ దళ్ చీఫ్ (INLD) ఓం ప్రకాష్ చౌటాలా(Om Prakash Chautala) కన్నుమూశారు. 89 ఏళ్ల ఓం ప్రకాష్ గుర్ గ్రాం(Gurugram)లోని తన నివాసంలో గుండెపోటుతో(INLD Chief Death) తుదిశ్వాస విచారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబసభ్యలు తెలిపారు. దేశ ఉపప్రధానిగా పనిచేసిన చౌదరి దేవీ లాల్(Chaudhary Devi Lal) కుమారుడే ఓం ప్రకాష్ చౌతాలా. జనవరి 1, 1935న సిర్సాలో జన్మించిన చౌటాలా.. అత్యధికంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదుసార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. 1989లో తొలిసారి హర్యానా ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. రెండు నెలల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ఐదు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. మూడోసారి 1991లో వచ్చింది, కానీ రెండు వారాల్లోనే హర్యానాలో రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో, పదవినుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆతర్వాత 1999, 2005 మధ్య వరుసగా రెండు సార్లు సీఎంగా కొనసాగాడు.

రాజ్యసభ ఎంపీగా..

ఇకపోతే, 1987లో రాజ్యసభకు ఎన్నికైన చౌటాలా.. ఎంపీగా 1990 వరకు పనిచేశారు. 1999-2000 మధ్య కాలంలో హర్యానాలో జూనియర్ బేసిక్ టీచర్ల నియామకానికి సంబంధించిన కుంభకోణంలో అతనికి పదేళ్ల జైలుశిక్ష పడింది. 2013లో శిక్ష పడగా.. తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్ష అనుభవించారు. ఆ తర్వాత జూలై 2021లో తీహార్ జైలు నుండి విడుదలయ్యాడు. ఇక, ఓం ప్రకాష్ చౌటాలా చివరిసారిగా 2009లో ఉచన కలాన్ నుండి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

Tags:    

Similar News