CAT-2024 Results: క్యాట్-2024 ఎగ్జామ్ ఫలితాలు విడుదల
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబర్ 24న కామన్ అడ్మిషన్ టెస్ట్-2024(CAT-2024)ను నిర్వహించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM)కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబర్ 24న కామన్ అడ్మిషన్ టెస్ట్-2024(CAT-2024)ను నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 389 కేంద్రాల్లో ఈ పరీక్షను కండక్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ పరీక్షకు సంబంధించి తుది ఫలితాలు(Final Results) తాజాగా విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://iimcat.ac.in లో తమ యూజర్ ఐడీ(User Id), పాస్ వర్డ్(Password) డీటెయిల్స్ ఎంటర్ చేసి స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది క్యాట్ పరీక్షకు దాదాపు 3 లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నారు. మొత్తం 2.93 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో నిర్వహించిన ఈ ఎగ్జామ్ లో సాధించిన స్కోర్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ మార్కులతో ఐఐఎం(IIM)లే కాకుండా మంచి పేరున్న కాలేజీలు కూడా సీట్లను భర్తీ చేస్తాయి.