నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. RRB నుంచి మరో నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

రైల్వే ఉద్యోగాల(Railway jobs) కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణావకాశం.

Update: 2025-03-26 12:04 GMT
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. RRB నుంచి మరో నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: రైల్వే ఉద్యోగాల(Railway jobs) కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణావకాశం. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబందించి ప్రతి ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ లోకో పైలట్-2025(Assistant Loco Pilot-2025) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ OBC లకు రూ.500, మిగతా వారికి రూ.250 గా ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ మే 9గా ప్రకటించారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్ ద్వారా  https://indianrailways.gov.in/  అప్లై చేసుకోవచ్చు.

విద్యా అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ITI, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ ఉన్న వారిని అర్హులుగా పేర్కొంది.

వయోపరిమితి: అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwD/ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.

Tags:    

Similar News