విద్యార్థులకు గుడ్ న్యూస్.. విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి స్కూళ్లలో!

రాష్ట్రంలోని విద్యార్థులకు విద్యాశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తుంది.

Update: 2025-03-26 14:07 GMT
విద్యార్థులకు గుడ్ న్యూస్.. విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి స్కూళ్లలో!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని విద్యార్థులకు విద్యాశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విద్య వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యారంగంలో పలు కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా(Andhra Pradesh) ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రభావం చూపడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల ప్రభావంతో స్కూల్ విద్యార్థులు డీ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాఠశాలల్లో వాటర్ బెల్ ఏర్పాటు చేయాలని సోమవారం సమీక్ష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ తరుణంలో విద్యాశాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు వాటర్ బెల్ మోగించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు మొదటి వాటర్ బెల్, 11 గంటలకు రెండో వాటర్ బెల్, 12 గంటలకు మూడో వాటర్ బెల్(Water Bell) మోగించాలని సూచించారు. ఈ క్రమంలో ఆ సమయంలో విద్యార్థులు(Students) వాటర్ తాగుతున్నారో లేదో ఉపాధ్యాయులు గమనించాలని తెలిపారు. వాటర్ బాటిల్ తెచ్చుకోలేని విద్యార్థులకు పాఠశాలలో ఆర్‌ఓ సిస్టమ్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలన్నారు. దీంతో ‘‘డ్రింక్ వాటర్ ఎవ్రీ అవర్.. స్టే కూల్, స్టే సేఫ్’’ పేరుతో పోస్టర్లు క్లాస్ రూమ్ లో వాటర్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు వెల్లడించారు.

Tags:    

Similar News