Mumbai Boat Tragedy: ట్రయల్ రన్ కు ఎవరు అనుమతులు మంజూరు చేశారు?

అరేబియా సముద్రంలో నేవీ బోటు(Mumbai Ferry boat), ఫెర్రీని ఢీకొన్న ప్రమాదంపై ముంబైలోని కొలబా పోలీసులు(Mumbai's Colaba Police ) దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Update: 2024-12-20 08:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అరేబియా సముద్రంలో నేవీ బోటు(Mumbai Ferry boat), ఫెర్రీని ఢీకొన్న ప్రమాదంపై ముంబైలోని కొలబా పోలీసులు(Mumbai's Colaba Police ) దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇండియన్‌ నేవీ(Indian Navy), మహారాష్ట్ర మారిటైం బోర్డుకు(Maharashtra Maritime Board) ముంబై పోలీసులు లేఖ రాశారు. సముద్ర మార్గంలో అత్యంత రద్దీగా ఉన్న సమయంలో ట్రయల్‌ రన్‌కు ఎవరు అనుమతులు మంజూరుచేశారని ప్రశ్నించారు. ట్రయల్‌ నిర్వహణలో పాటించిన ప్రొటోకాల్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. నేవీ బోటులో థొరెటల్ సమస్య ఉందని, దీనివల్ల అది నియంత్రణ కోల్పోయి.. ప్రయాణికుల పడవను ఢీకొట్టిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అంతేకాకుండా, ఫెర్రీ బోట్‌లో కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చున్నారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నేవీ గురువారం బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటుచేసింది. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి బోట్ రైడ్ చేసేవారంతా లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవలే ప్రమాదం

ఇటీవలే, ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ‘నీల్‌కమల్‌’ అనే ఫెర్రీ.. దాదాపు 100 మందికి పైగా పర్యటకులతో బయలుదేరింది. అప్పుడే వేగంగా వచ్చిన నేవీకి చెందిన ఓ స్పీడ్‌ బోటు ఫెర్రీని బలంగా ఢీకొట్టింది. దాంతో ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో రెండు నౌకల్లో ఉన్న మొత్తం 113మందిలో 98 మందిని రక్షించగా..మిగిలినవారు గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య 14కు చేరింది. గల్లంతైన ఒక్క ఏడేళ్ల బాలుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇకపోతే, ప్రమాద సమయంలో బోటులో ప్రయాణించిన పాల్ఘర్ జిల్లాకు చెందిన కూరగాయల విక్రేత గౌరవ్ గుప్తా నేవీ బోటుపై స్పందించారు. ప్రమాదానికి కారణం ఇంజన్‌ ఫెయిల్యూర్‌ కాదని.. స్పీడ్‌బోట్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు.

Tags:    

Similar News