అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన బలాష్టి గంగాధర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, వెల్గటూర్ : వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన బలాష్టి గంగాధర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఎస్సై ఉమా సాగర్ తెలిపారు. మృతుడు కొంతకాలంగా దృష్టిలోపంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తన సొంత పనులు సైతం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు బంధువులు తెలిపారు.
దీంతో తీవ్రమైన మానసిక వేధనకు గురై జీవితంపై విరక్తి చెంది ఈనెల ఒకటో తారీఖున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతుడి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.