suicide : క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య

క్షణికావేశానికి గురై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తిరుమలాయపాలెం మండలంలో వెలుగు చూసింది.

Update: 2024-11-02 14:44 GMT

దిశ, తిరుమలాయపాలెం : క్షణికావేశానికి గురై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తిరుమలాయపాలెం మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన వీరబోయిన నవ్య(22), భర్త శ్రీశైలం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి గేదెలు ఉన్నాయి. శుక్రవారం గేదెలు మేతకు తోలే విషయంలో భర్త శ్రీశైలం, నవ్యకు పొలం వద్ద ఘర్షణ జరిగింది. అనంతరం శ్రీశైలం అరక తోలేందుకు వెళ్లగా మనస్తాపానికి గురైన నవ్య వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

    సాయంత్రం శ్రీశైలం ఇంటికి వచ్చి చూడగా నవ్య కనిపించక పోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల అనుమానంతో శనివారం బావి వద్దకు వెళ్లి చూడగా అందులో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలికి 4 సంవత్సరాల పాప, రెండున్నర ఏళ్ల బాబు ఉన్నారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నవ్య మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదేశ్ తెలిపారు.  

Tags:    

Similar News