మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాలలో తనకు గ్రేడ్ పాయింట్స్ తక్కువగా వచ్చాయి అన్న మనోవేదనతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గురిగిని శెట్టి కాలనీకి చెందిన శ్రావణి (16) అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Update: 2023-05-10 17:18 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాలలో తనకు గ్రేడ్ పాయింట్స్ తక్కువగా వచ్చాయి అన్న మనోవేదనతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గురిగిని శెట్టి కాలనీకి చెందిన శ్రావణి (16) అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కాలనీలోనే ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న శ్రావణి ఉదయం ఫలితాలు వచ్చిన తర్వాత అందరితో ఉత్సాహంగా గడిపి స్వీట్లు కూడా పంపిణీ చేసింది.

మిగతా విద్యార్థుల కన్నా గ్రేడ్ పాయింట్లు తనకు తక్కువగా వచ్చాయన్న విషయం తెలుసుకొని బాధతో తమ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లుగా గుర్తించారు. దీంతో శ్రావణి కుటుంబంలోనే కాకుండా కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags:    

Similar News