రోడ్డు రోలర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముందు భాగం తుక్కుతుక్కు

మంగళవారం తెల్లవారు జామును రోడ్డు ప్రమాదం(road accident) చోటు చేసుకొని 20 మందికి గాయాలయ్యాయి.

Update: 2024-12-17 05:19 GMT

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం తెల్లవారు జామును రోడ్డు ప్రమాదం(road accident) చోటు చేసుకొని 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి తిరుపతి(Tirupati)కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు(RTC bus).. వేగంగా వెళ్లి రోడ్డు రోలర్(road roller) ను ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న రుయా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా వేగంగా వచ్చిన బస్సు రోడ్డు రోలర్ ను ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది.


Similar News