Hit and Run : ర్యాష్ డ్రైవింగ్.. వ్యక్తి మరణానికి కారణమైన కాంగ్రెస్ నేత కుమారుడు

వేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణం అయ్యాడు కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నేత కుమారుడు.

Update: 2024-11-17 13:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : వేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణం అయ్యాడు కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ నేత కుమారుడు. కర్ణాటక(Karnataka)లోని ఉడిపి జిల్లాలో జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉడిపి(Udipi) జిల్లా శిర్వాలోని బెలపు గ్రామానికి చెందిన దేవీ ప్రసాద్ శెట్టి ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు. నవంబర్‌ 13న తెల్లవారుజామున ఆయన కుమారుడు ప్రజ్వల్ శెట్టి, ఎస్‌యూవీని వేగంగా నడిపి.. బైక్‌పై వెళ్తున్న 39 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన హుస్సేన్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా, శిర్వా పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, ప్రజ్వల్‌ను నవంబర్‌ 14న అరెస్ట్‌ చేశారు. అదే రోజున కోర్టులో హాజరుపర్చగా.. అతడు బెయిల్‌ పొందాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News