Ap News: లారీకి తగిలిన విద్యుత్ తీగలు.. డ్రైవర్, మరో వ్యక్తి మృతి
విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు..
దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నంద్యాల జిల్లా మహానంది మండలం అబ్బీపురంలో జరిగింది. అరటికాయల గెలల లోడుతో మినీ లారీ వెళ్తోంది. అయితే రోడ్డుపై వేలాడుతున్న విద్యుత్ వైర్లు లారీకిపై భాగాన తగిలాయి. దీంతో లారీ డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ నిలిపివేసి లారీని రోడ్డుపై నుంచి పక్కకు తీశారు. లారీలో నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More...
విజయవాడలో దారుణం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆరుగురు దాడి