Ahobilam: పెద్దపులిని ఢీకొట్టి నుజ్జు నుజ్జు అయిన కారు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలో పెద్ద పులి సంచరిస్తోంది...

Update: 2024-11-06 15:41 GMT

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District) ఆళ్లగడ్డ మండలం అహోబిలం(Ahobilam) సమీపంలో పెద్ద పులి సంచరిస్తోంది. అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తుండగా పెద్దపులి(Tiger)ని కారు ఢీకొట్టింది. దీంతో కారు(Car) అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే కారు ఢీకొట్టిన తర్వాత పెద్దపుల్లి పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో అటవీ శాఖ అధికారులు(Forest Department officials) పెద్దపులిని బంధించేందుకు యత్నిస్తున్నారు. పులిని ఢీకొట్టిన కారును క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీశైలం అటవీ ప్రాంతం(Srisailam forest area)లో పెద్దపులి కనిపించడం ఇది రెండోసారి అని అధికారులు చెబుతున్నారు. అయితే పెద్దపులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. త్వరగా పులిని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News