TTD: శ్రీవారి భక్తులకు భారీ గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదం విక్రయాలపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) మరో శుభవార్త చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి భక్తులు కోరినన్ని లడ్డూలను ఇచ్చేందుకు టీటీడీ (TTD) ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం తయారు చేస్తున్న లడ్డూల కంటే అవసరం అయిన మేర ప్రసాదాల తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తోంది. కాగా, ప్రస్తుతం టీటీడీ (TTD) ప్రతిరోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలతో పాటుగా 6 వేల కళ్యాణం లడ్డూ (Kalyanam Laddu), 3,500 వడలను తయారు చేస్తున్నది.
అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ప్రసాదాలను తిరుమల (Tirumala)తో పాటుగా తిరుపతి (Tirupati) లోకల్ ఆలయాలు, హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Brngaluru), చెన్నై (Chennai), విశాఖపట్నం (Vishakhapatnam), అమరావతి (Aamaravati), ఒంటిమిట్ట (Ontimitta) ఆలయంలో కూడా విక్రయిస్తున్నారు. తిరుమల (Tirumala)లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు కూడా ఒక చిన్న లడ్డూను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ (TTD) ప్రస్తుతం తయారు చేస్తున్న లడ్డూల కంటే అదనంగా మరో 50 వేల చిన్న లడ్డూలు, 4వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పోటు విభాగంలో లడ్డూ తయారీకి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులతో పాటు మరో 10 పది మంది ఇతర సహాయకులను నియమించనున్నారు.