ఇళ్లకు గడియ పెట్టి.. అర్ధరాత్రి బిచ్కుందలో హల్ చల్!
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అర్ధరాత్రి అగాంతకులు హల్ చల్ సృష్టించారు.
దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అర్ధరాత్రి అగాంతకులు హల్ చల్ సృష్టించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ వాడలో కొంతమంది దుండగులు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రతి ఇంటికి బయట నుంచి గడియ పెట్టారు. అనంతరం 6 గడ్డివాములకు నిప్పు పెట్టి భయాందోళన వాతావరణం సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ శాఖ ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. ఫైర్ ఇంజన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Read More...