మంచం పట్టెతో దాడి.. ఒకరి మృతి

మండలం లోని చిన్న ముప్పారం గ్రామంలో ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి మల్లం యాకయ్య (60) సంవత్సరాలు రోడ్డుపై వెళ్తుండగా మల్లం రాజు అనే వ్యక్తి మంచం పట్టేతో దాడి చేయగా యాకయ్య అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు .

Update: 2024-09-27 06:01 GMT

దిశ, ఇనుగుర్తి(నెల్లికుదురు): మండలం లోని చిన్న ముప్పారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు(శుక్రవారం) ఉదయమే కాలకృత్యాలు తీర్చుకోవడానికి మల్లం యాకయ్య (60) సంవత్సరాలు రోడ్డుపై వెళ్తుండగా మల్లం రాజు అనే వ్యక్తి మంచం పట్టెతో దాడి చేయగా యాకయ్య అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు . ఈ విషయం తెలుసుకున్న సీఐ జగదీష్ నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య సోమక్క, కుమారుడు రమేష్, కూతురు నాగలక్ష్మి ఉన్నారు.


Similar News