Betting Apps Pramotion Case : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇరుక్కోనున్న మెట్రోరైలు సంస్థ
ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటుల పేర్లు బయటికి రాగా.. వారందరికీ నోటీసులు పంపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో హైదరాబాద్ మెట్రోరైలు(Hyderabad Metro Rail) పేరు బయటికి వచ్చింది. పలు మెట్రోరైళ్లపై బెట్టింగ్ యాప్స్ వాణిజ్య ప్రకటనలు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెట్రోరైలు సంస్థ మీద కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ బెట్టింగ్ అడ్వర్టైజ్‌మెంట్‌లపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(Metro MD NVS Reddy) స్పందించారు.
కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని తన దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు. ఆ ప్రకటనలను తక్షణమే తీసివేయాలని ఎల్‌అండ్‌టీ మరియు సంబంధిత అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలను ఆదేశించినట్టు పేర్కొన్నారు. గురువారం మెట్రో సేవల అనంతరం వాటన్నిటినీ తొలగిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే లక్షలాది మంది ప్రయాణిస్తున్న ప్రజారవాణ సంస్థకు రైళ్లపై ఏలాంటి ప్రకటనలు వేస్తున్నారో ఎండీకి తెలియకపోవడమేంటని? పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆదాయం కోసం వివాదాస్పదమైన వాణిజ్య ప్రకటనలకు అనుమతులివ్వడం నేరం కాదా? నిలదీస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఇప్పటికైనా మెట్రోరైలు అధికారులు గుర్తించి వాటిని తొలగించాలని నిర్ణయించడం హర్షనీయమంటున్నారు.