ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య..

మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన త్రివేణి (25) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోనికి వచ్చింది.

Update: 2023-06-18 15:10 GMT

దిశ , మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన త్రివేణి (25) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోనికి వచ్చింది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణతో త్రివేణికి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భర్త లక్ష్యనారాయణతో కలిసి మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామంలోని తల్లి వద్దకు వచ్చినట్లు సమాచారం. రాత్రి తల్లి నిద్రలో ఉండగా తెల్లవారుజామున త్రివేణి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతురాలి తల్లి కృష్ణవేణి తెలిపారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు.

Tags:    

Similar News