Infant Murder: తండ్రిపై ప్రతీకారం.. 3 నెలల చిన్నారి హతం
తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ వ్యక్తి 3 నెలల చిన్నారిని హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు 3 నెలల చిన్నారిని హతమార్చాడో సైకో. ప్రిన్స్ పాండే అనే వ్యక్తితో గొడవ పడిన వీరేంద్ర చౌదరి.. అతనిపై పగ తీర్చుకోవాలని భావించి 3 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేశాడు. చిన్నారి తండ్రి సమీప పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా.. మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాత్నాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్ నగర్ కు చెందిన వీరేంద్ర చౌదరి అనే వ్యక్తి.. నవంబర్ 6న ఓ గుడి వద్ద తల్లిదండ్రుల చెంతన ప్రశాంతంగా నిద్రిస్తున్న పసికందును కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి బిడ్డను దూరంగా తీసుకెళ్లి నేలకేసి కొట్టాడు. అనంతరం హత్య చేశాడు. ఉదయం లేచేసరికి బిడ్డ కనిపించకపోవడంతో.. సాత్నాలోని జీఆర్ పీ పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చడు. తాను, తన భార్య దేవాలయం సమీపంలో నిద్రిస్తుండగా.. తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సెక్షన్ 137(2) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. చిన్నారి కోసం గాలించారు. నవంబర్ 8న పన్నీ లాల్ చౌక్ లో గోనె సంచిలో ప్యాక్ చేసిన శిశువు మృతదేహం లభ్యమైంది. పాండే తన బిడ్డేనని గుర్తించడంతో.. పోలీసులు నిందితుడి కోసం గాలించాగు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా.. వీరేంద్రచౌదరి బిడ్డను కిడ్నాప్ చేసిన దృశ్యాలు కనిపించాయి. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. పాండే తో ఉన్న గొడవ కారణంగానే బిడ్డను చంపానని చెప్పాడు. అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకున్నారు.