దుబాయిలో కథలాపూర్ మహిళ ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన అన్నమనేని సుప్రియ(35) దుబాయిలో సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది.

Update: 2024-11-13 09:57 GMT

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన అన్నమనేని సుప్రియ(35) దుబాయిలో సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. సుప్రియ భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె గత కొంతకాలంగా దుబాయిలో భర్త వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఎప్పటిలాగే భర్త శ్రీనివాస్ రావు ఉద్యోగం నిమిత్తం ఆఫీస్ కు వెళ్లగా పిల్లలు స్కూల్ కు వెళ్లారు.

     తిరిగి వచ్చి చూసేసరికి సుప్రియ విగత జీవిగా పడి ఉండటంతో బోరున విలపించారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా మృతురాలికి కూతురు దీక్ష, కొడుకు ప్రణవ్ ఉన్నారు. చిన్న వయసులో సుప్రియ మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా ఆమె స్వస్థలం రాయికల్ మండల కుమ్మరిపల్లి గ్రామం. 


Similar News