దారుణం...మహిళను హత్యచేసి... పొలంలో పాతిపెట్టి...

గత కొంతకాలం క్రితం ఉద్యోగం ఇప్పిస్తానంటే డబ్బులు కట్టి మోసపోయిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-11-13 10:14 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : గత కొంతకాలం క్రితం ఉద్యోగం ఇప్పిస్తానంటే డబ్బులు కట్టి మోసపోయిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా భావిస్తున్న మహిళ కూడా హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే... జూలూరుపాడు గ్రామస్తులైన దంపతులు హలవాత్ రత్నకుమార్, పార్వతి కొత్తగూడెంలోని ఒక షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని కరీంనగర్​కు చెందిన వ్యక్తి 16 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేయడంతో వీరు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.

    కేసు విచారణ చేపట్టిన జూలూరుపాడు పోలీసులకు విస్తూపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మృతుల వద్ద డబ్బులు తీసుకున్న నిందితులైన పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వాతి, జూలూరుపాడు మండలం మాచినపేటతండాకు చెందిన వీరభద్రంను విచారించడంతో స్వాతి రూ.8 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారం రోజులు గడువుకోరి వెళ్లి ఇప్పటి వరకు రాలేదు. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు వీరభద్రంను అదుపులోకి తీసుకుని విచారించడంతో స్వాతిని పదునైన కత్తితో హత్య చేసి తన సొంత పొలంలో పాతిపెట్టినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. సంఘటనా స్థలానికి రెవెన్యూ అధికారులు పోలీసులు చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. 


Similar News