ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మండల కేంద్రానికి చెందిన బత్తిని గంగారాం పశువుల కొట్టంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, కుబీర్ : మండల కేంద్రానికి చెందిన బత్తిని గంగారాం పశువుల కొట్టంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చూపించిన కుదుటపడలేదు. ఉదయం నుండి మద్యం తాగుతున్నాడు. కుటుంబ సభ్యులు చేను పనులకు వెళ్లగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడు బత్తిని దిగంబర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.