కులగణన సర్వే సిబ్బందిపై వ్యక్తి దాడి
కులగణన సర్వే సిబ్బందిపై వ్యక్తి దాడి చేశాడు.
దిశ, తిరుమలగిరి : కులగణన సర్వే సిబ్బందిపై వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోయినపల్లి ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళా సిబ్బంది బోయినపల్లి 1వ వార్డులో సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి ఓ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టింది.
బయటకు వచ్చిన ఆ ఇంటి యజమాని ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెపైన చేయిచేసుకున్నాడు. దీంతో సర్వేకు వెళ్లిన సదరు మహిళ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపి వారి సహాయంతో బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.