వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి..
వడదెబ్బతో ఉపాధి హామీ కూలి ఒకరు మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో శనివారం జరిగింది.
దిశ, తుంగతుర్తి : వడదెబ్బతో ఉపాధి హామీ కూలి ఒకరు మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కొండ వీరస్వామి (75) సమీపంలోని అవుసలోని కుంటలో ఉపాధి పనులు ముగించుకొని వస్తుండగా మార్గమధ్యలో వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తోటి కూలీలు ప్రధమ చికిత్సలో భాగంగా సపర్యలు చేస్తుండగానే వీరస్వామి మృతిచెందారు. ఈ విషయం పై ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వీస్తున్న వడ గాలుల నుండి ఉపశమనం పొందడానికి సంబంధిత అధికారులు పనులు జరిగే ప్రదేశంలో నిబంధనల ప్రకారం సరైన ఏర్పాట్లు చేయడం లేదని అన్నారు.
ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యం వల్లే వీరస్వామి మృతి చెందారని ఆరోపించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే అధికారులు వచ్చేవరకు శవాన్ని తీసేది లేదంటూ కుటుంబీకులతో పాటు ఉపాధి హామీ కూలీలు స్పష్టం చేశారు. విషయాన్ని తుంగతుర్తి ఎంపీడీవో భీమ్ సింగ్, ఉపాధి హామీ శాఖ అధికారులకు తెలియపరిచారు.