Jani Master : జానీ మాస్టర్ కస్టడీపై కీలక తీర్పు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-09-25 11:55 GMT

దిశ, గండిపేట్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనను నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. బుధవారం నుంచి శనివారం వరకు కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది.

    పొక్సో కేసుపై నార్సింగ్ పోలీసులు విచారణ జరపనున్నారు. జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు నార్సింగ్ పోలీసులు చంచల్ గూడ జైలుకి వెళ్లారు. కాగా ఇప్పటికే బాధితురాలి నుంచి పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. వీటిని జానీ ముందు పెట్టి ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కాగా పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏమి చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News