అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించారు.

Update: 2024-10-18 12:13 GMT

దిశ, ఆదిలాబాద్ : నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెలలో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఆ కేసులో కొందరు అరెస్టు కాగా మరి కొందరు నేడు పట్టుబడినట్టు చెప్పారు. వీరు మహారాష్ట్రలోని బుల్ధాన జిల్లాకు చెందిన గోతిరాం గురుదయాల్ సాబ్లే, శుభం గోతిరాం సాబ్లే, అమర్ సింగ్ నారాయణ గోతి, సోమనాథ్ బికా సాబ్లెగా తెలిపారు.

    వీరి వద్ద ఒకటిన్నర కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, గత నెలలో గంజాయి కేసులో వాహనానికి ముందుండి నడిపిన వ్యానును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి ఈ బృందం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ దాడుల్లో జైనథ్ సీఐ డి.సాయినాథ్, రూరల్ సీఐ కె.ఫనిదర్, ఎస్సై ముజాహిద్, సిబ్బంది రుక్మారెడ్డి, గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్, నరేష్ ఉన్నారు. వీరిని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News